HomeCRIMEపోలీసుల ఆంక్షలు బేఖాతర్ ......తెల్లవారు జామున దాక సాగుతున్న సాయి మెస్ దందా ........తినడానికి వచ్చి...

పోలీసుల ఆంక్షలు బేఖాతర్ ……తెల్లవారు జామున దాక సాగుతున్న సాయి మెస్ దందా ……..తినడానికి వచ్చి తన్నుకున్న రెండు గ్యాంగ్ లు

పోలీసుల ఆంక్షలు బేఖాతర్ చేస్తూ నగర నడిబొడ్డున అదికూడా సీపీ క్యాంప్ ఆఫీస్ కు కూత వేటు దూరం ఉండే సాయి మెస్ దర్జాగా తెల్లవారు జామున దాక తమ దందా సాగించుకుంటుంది.

అదే హోటల్ కు తినడానికి రెండు గంటల ప్రాంతంలో వచ్చిన రెండు గ్యాంగ్ లమధ్య మాట మాట పెరిగింది.తన్నుకున్నారు.రాత్రి విధుల్లో ఉన్న ఆరో టౌన్ యస్సై హుటాహుటి రావడంతో అనర్థం తప్పింది.

అయిన తాగిన మైకం లో ఆ యువకులకు సర్ది చెప్పడానికి పోలీసులు చాల సేపే శ్రమించారు.పెట్రోలింగ్ లో ఉన్న ఎస్సై అసలు హోటల్ తెల్లవారు జామున దాక ఎలా తెరిచి వుందని అవాక్కు అయ్యారు బస్టాండ్ లో ఉండే హోటల్ రాత్రి 11 న్నర కే మూసేసారు మీరు ఎలా తెరిచారు అంటూ ఎస్సై వాకబు చేస్తే ఎహే మా సార్ కాంగ్రెస్ లీడర్ కదా ఇదిగో స్పెషల్ పర్మిషన్ వుందని పత్రాలు ఇచ్చాడు.

సరే తన పరిధి లో లేని పంచాయితీ నాకెందుకు అనుకోని గొడవ సద్దమనిగేలా చేసి వెళ్లి పోయారు.నిజానికి కమిషనర్ సాయి చైతన్య నగరంలో వ్యాపార సముదాయాలను 11 గంటల వరకు మూసేయాలని ఆదేశించారు.

ఆంక్షల ను అమలు చేసే విషయంలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. గత మూడు నెలలుగా స్థానిక పోలీసులు సైతం రాత్రి పదిన్నరకు కూయ్యు కూయ్యు అంటూ సైరన్ లు మోగిస్తూ హడావుడి చేస్తూ సీపీ ఆదేశాలను అమలు చేస్తున్నారు.ఆంక్షలు ఉల్లఘించి షాప్ లు తెరిచే వారిమీద కేసు నమోదు చేసి కోర్టు కు తీసుకెళ్లారు.

దీనితో సహజంగానే వ్యాపారుల్లో వణుకు పుట్టింది షాప్ లు నిర్ణిత సమయానికే మూసేస్తూ వస్తున్నారు.కానీ శనివారం తెల్లవారు జామున దుబ్బ కోటగల్లికి .

ప్రాంతాలకు చెందిన యువకులు బస్టాండ్ ఎదురుగా ఉండే సాయి హోటల్ కు తినడానికి వచ్చారు అక్కడే ఆ రెండు గ్యాంగ్ ల మధ్య మాట మాట పెరిగి తన్నుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments