పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, స్పష్టం చేశారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలను భంగపెట్టే రీతిలో ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. .
ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులు తక్షణమే తమ బాధను సంబంధిత అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు.
నిజామాబాద్ మెడికల్ కాలేజ్ లో 2021 నుండి MBBS చేస్తున్నరాహుల్ డే కాలర్స్ గా ఉన్నందున ఇతని సీనియర్ అయిన సాయిరాం పవన్ మొదటి సంవత్సరం నుండి బూతు మాటలు తిడుతూ ర్యాగింగ్ చేసేవారు. రాహుల్ రెడ్డి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఇతని యొక్క సీనియర్ అయిన సాయిరాం పవన్ ఇతని యొక్క. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని ఐదు రోజులు రానట్టు రిజిస్టర్లో ఆబ్సెంట్ వేశాడు.
ఈ విషయం గురించి అడిగితే నీవు ఎవడ్రా అడగటానికి అని బెదిరించాడు ఇట్టి విషయాన్ని జూనియర్ మరియు సీనియర్స గా రెండు బ్యాచులుగా విడిపోయి గొడవగా సృష్టించాడు, దీన్ని ఆసరాగా తీసుకొని రాబోయే గణేష్ నిమజ్జనాన్ని ఎలా నిర్వాహిస్తారో చూస్తాము అంటూ బెదిరించి, చివరకు నిన్నశనివారం సాయంత్రం తోటి స్నేహితులతో ఫోన్ చేయించి పిలిపించి సెటిల్ చేసుకుందామని రాహుల్ రెడ్డి ని మెడికల్ హాస్టల్ కు పిలిపించరని రాహుల్ రెడ్డి స్నేహితులత కలిసి హాస్టల్ కు వెళ్లేసరికి అక్కడ సుమారు 15 మంది సీనియర్స్ ఉన్నారు రాహుల్ ను గోడకుర్చీ, జి. ఎం.సి. సెల్యూట్ చేయించి అతని బయోడేటా పలుమార్లు చెప్పించారు, బట్టలు విప్పించి బయట తిప్పిస్తామని బెదిరించారు, స్నేహితులు ఆపడానికి మధ్య వస్తే వాళ్లను కూడా కొడతామని బెదిరించినారు.
ఇదే మాదిరిగా సాయిరాం పవన్ మరియు శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్,అభినవ్ పెద్ది, ఆదిత్య అనే సీనియర్స్ కలిసి రాహుల్ రెడ్డిని చేతులతో కొట్టి కాలేజీలో ఎలా ఉంటావో ఎలా తిరుగుతావో ఎలా పాస్ అవుతావో చూస్తాము అంటూ భయభ్రాంతులకు గురి చేయగా వారి నుండి తప్పించుకోని హాస్టల్ నుండి పారిపోయి ఇంటికి వెళ్లి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని పిర్యాదు చేశారు కేసు నమోదు పరిచి పరిశోధన ప్రారంభించినది.
భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్ కి ఎవరైనా పాల్పడితే వారి పైన కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది.
కావున ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిసిన లేదా గమనించిన లేదా ర్యాగింగ్ కు సహకరించిన వారి సమాచారము దగ్గరలోని పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100 కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659700 కు సమాచారాన్ని అందించాలని కమిషనర్ కోరారు
