బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. కోర్టు విధించిన బౌండ్ ఓవర్ షరతులను ఉల్లంఘించిన చాదర్‌ఘాట్‌కు చెందిన రౌడీ షీటర్ గద్దం అక్షయ్‌కుమార్‌కు విధించిన జరిమానాను కోర్టు ఆదేశాల మేరకు వసూలు చేశారు. నే
మనరాలకు పాల్పడకుండా విధించిన బౌండ్ ఓవర్‌ను అతిక్రమించడంతో తొలుత రూ.30 వేల జప్తు చలాన్ విధించగా, నిందితుడి వినతిపై న్యాయస్థానం దానిని రూ.20 వేలకు తగ్గించింది. మంగళవారం ఆ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు అక్షయ్‌కుమార్ జమ చేసినట్లు చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బౌండ్ ఓవర్ షరతులను ఉల్లంఘించినందుకు గాను ఈ నెల 14న న్యాయస్థానం రూ.30 వేల జప్తు చలాన్ చెల్లించాలని ఆదేశించింది. అనంతరం జరిమానా తగ్గించాలని ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించడంతో, విచారణ అనంతరం రూ.20 వేలకు తగ్గించారు.
ఆ మేరకు మంగళవారం జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేశారు.బౌండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు.
