నగరంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పాత నేరస్తుడు యూసుఫ్ గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం దాడి నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద తనిఖీలు నిర్వహించగా 190 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
