HomeCRIMEఅదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడుఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాని యువకుడు..

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడుఇంట్లో నుంచి వెళ్లి తిరిగిరాని యువకుడు..

నాగారం కెనాల్ లో మృతదేహం లభ్యం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడు బుధవారం ఉదయం నాగారం కెనాల్ లో శవమై కనిపించాడు. నగరంలోని టౌన్‌–V పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంద్రాపూర్‌కు చెందిన కండగాలే అశోక్‌ (24) ఈ నెల 21న రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో అతడి తల్లి తులసి టౌన్‌–V పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం నాగారం కెనాల్ లో అశోక్‌ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశోక్‌ పెయింటర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహం లభ్యమైన పరిస్థితులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments