HomePOLITICAL NEWSNationalరాహుల్ అరెస్టు కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్

రాహుల్ అరెస్టు కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్

కాంగ్రెస్ పార్టీ బుధవారం హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కు పిలుపు నిచ్చింది.

లోక సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, NEET పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం చలో రాజ్ భవన్ (లోక్ భవన్)” కార్యక్రమానికి సిద్ధం అయింది కాంగ్రెస్ శ్రేణులందరూ భారీ సంఖ్యలో తరలిరావాలి.

నెక్ లెస్ రోడ్డు లోని ఇందిరమ్మ విగ్రహం, నుంచి 11:00 గంటలకు లోక్ భవన్‌కు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లనున్నారు .మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలనిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments