నగల షాప్ లూటీ ఉదంతం మరువక ముందే కరీంనగర్ నగరంలోఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు.
ఇంట్లో వారిని బంధించారు పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు కరీంనగర్ లోని భరత్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని లైట్ ఆఫ్ చేసేందుకు బయటికి వచ్చాడు అప్పటికే మాటు వేసిన సాయుధ దుండగలు , వెనుక నుంచి వచ్చిన దుండగులు అతడిని బంధించారు.
బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు . అనంతరం ఇంట్లో ఉన్న వృద్ధులతో సహా నలుగురు కుటుంబ సభ్యులను గంటన్నర పాటు కట్టేసి ఉంచారు. బాధితుల అరుపులు బయటకు వినిపించకుండా టీవీ శబ్దాన్ని భారీగా పెట్టారు.ఇంట్లో ఉన్న వారి మెడలోని గొలుసులు, చేతి ఉంగరాలు, చెవి కమ్మలు కూడా లాక్కెళ్లారు.
అనంతరం రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని బాధితులు చెప్తున్నారు కమిషనర్ గౌస్ ఆలమ్ హుటాహుటిన సంఘటన స్థలం కు చేరుకొని ప్రత్యేక బృంధాలను రంగంలోకి దించారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ సీపీ తో మాట్లాడారు
