HomeDevotional10వ డివిజన్ లో ఘనంగా సిత్ల పండుగ..

10వ డివిజన్ లో ఘనంగా సిత్ల పండుగ..

నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని నాగారం జింగి తాండాలో లంబాడి సోదరులు సిత్ల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

లంబాడి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పండుగ సామాజిక ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించేలా ఉందని పలువురు పేర్కొన్నారు. గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొనగా, కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తండా పెద్దలు వసరం నాయక్, అర్జున్, చరణ్ సింగ్, గోపి, విజయ్, వినోద్ పవర్, పవన్ కళ్యాణ్, సంజీవ్, అనిల్, జగన్ అలాగే 9వ డివిజన్ కార్పొరేటర్ కేతవాత్ సురేఖ అమర్ సింగ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments