HomeLaw and Orderజిల్లాలో రానున్న 48 గంటలు భారీ వర్షం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్...

జిల్లాలో రానున్న 48 గంటలు భారీ వర్షం..జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి..

జిల్లాలో రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అలాగే అనవసరంగా ఎవరు బయటకు రాకూడదు: పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సిపి సాయి చైతన్య గురువారం రాత్రి కామారెడ్డి జిల్లాలోని నేషనల్ హైవే మీద వరద ఉద్రిక్తత ను పరిశీలించారు. ఈ మేరకు మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిందని ఈ మేరకు ప్రభుత్య అధికారులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ముఖ్యంగా ఎవ్వరకూడా విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్లకూడదని అన్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రజలు అత్యవసరంలో తప్ప ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దని అన్నారు.

ఎక్కడనైనా విద్యుత్తు తీగలు కింద పడ్డ లేదా వేలాడుతున్న లేదా వర్షపు నీటికి తగిలిన వాటిని ఎవ్వరు కూడా తాకరాదు వాటిని తాకినట్లయితే విద్యుత్ ప్రవాహం కలిగి ప్రమాదం సంభవించును.గణేష్ మండలి నిర్వాహకులు మండపం వద్ద తగు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి ప్రధానంగా విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళవద్దన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

పొంగిపొర్లనున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దు.జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదు – ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదన్నారు.పొలాల్లో పడిపోయిన విద్యుత్తు తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను.ఎక్కడైనా వరద ఉదృతి తలెత్తిన సందర్భంలో పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ , మునిసిపల్ , వ్యవసాయం , గ్రామీణాభివృద్ధి , పశుసంవర్ధక , ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలి అని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అత్యవసర సమయంలో డయల్ 100 ( లేదా ) పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్:8712659700( లేదా ) సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments