పదకొండు రోజుల పాటు ఘన పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి.
నగరంలో కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. నగరమంతటా వందల విగ్రహాలను ప్రతిష్టించారు.
ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేసింది.
భక్తుల తన్వయత్వం, యువత ఉత్సాహం, చిన్నారుల కేరింతలు, జిల్లా వాసుల జయ జయధ్వానాలతో గణేష్ నిమజ్జనోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగింది.
నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడిని నృత్యా లు, కోలాటాల మధ్య ఊరేగింపుతో నిమజ్జనా నికి తరలించారు. బ్యాండు మేళాలు, భాజా భజంత్రీలు, సంప్రదాయ నృత్యాలు వెరసి ఉండ్రాలయ్యను తల్లి గంగమ్మ ఒడికి సాగ నంపాయి.
గణపతి బొప్పా మోరియా … ఆదా లడ్డూ చోరియా అంటూ భక్తులు హోరె త్తిన నినాదాలతో గణపయ్యకు ఘనమైన వీడ్కోలు పలికారు. అలాగే నగరంలో డెబ్బై ఏళ్లుగా సార్వజనిక్ ఆద్వర్యంలో గణేష్ రథ యాత్ర స్థానిక దుబ్బా నుంచి ఘనంగా ప్రారంభమైంది.
ఈ శోభాయాత్ర ను స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ జెండా ఊపి డంతో రథం ప్రారంభించడంతో ముందుకు కదిలింది.
ఈ శోభాయాత్ర లో ఎడ్ల జోడ్లతో ముందుకు నడవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రథ యాత్రను తిలకించడానికి వేలాది మంది భక్తజనం తరలివచ్చారు.దీంతో ఈ శోభాయాత్ర కనులపడగగా మారింది.గతంలో ఊరేగింపు ఎడ్లపై జరిగినప్పుడు 45 జతల ఎడ్లు ఉండేవని కానీ కాలక్రమేనా వ్యవసాయంలో ఎడ్ల బండ్ల కనుమరుగు అయిపోవడంతో దశాబ్ద కాలంగా రథం లాగడానికి ఎడ్లను సమకూర్చడం కష్ట తరం అయింది.
కానీ ఆనవాయితీగా కొనసాగించాలనే పట్టుదలతో వివిధ ప్రాంతాల నుంచి 10 నుంచి 15 ఎడ్ల జతల ఎడ్లను అద్దెకు తెప్పిస్తున్నారు. సంప్రదాయ నృత్యాలు వెరసి ఉండ్రాలయ్యను తల్లి గంగమ్మ ఒడికి సాగ నంపాయి.4 ఫీట్ల లోపు గల విగ్రహ ప్రతిమలు నగరంలోని వినాయక బావిలో నిమజ్జనం చేశారు.
అంతకు మించిన విగ్రహాలను నందిపేట్ లోని ఉమ్మేడ, బాసర్,వివిధ చెరువులలో నిమజ్జనం కోలాహలంగా చేశారు. ఈ నిమజ్జన సందర్భంగా గణపతి బొప్పా మోరియా … ఆదా లడ్డూ చోరియా అంటూ భక్తులు హోరె త్తిన నినాదాలతో గణపయ్యకు ఘనమైన వీడ్కోలు పలికారు.
నిమజ్జనోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ దీపాల ఏర్పాటు, రెండు భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లను ప్రత్యేకంగా ఏర్పా టు చేశారు. జిల్లా లోని మండలాల గణనా థులను ఆయా ప్రాంతాల సమీప చెరువుల్లో నిమజ్జనం చేశారు.
