హైదరాబాద్ లో అతిపెద్ద డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు ను మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు .శనివారం మహారాష్ట్ర నార్కోటిక్ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడులతో అతిపెద్ద డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది…
మేడ్చల్ జిల్లాలోజరిపిన ఈ దాడుల్లో డ్రగ్స్ తయారీ దందా బయటపడింది. యండి డ్రగ్స్ తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీని పెట్టారు. దుండగులు. డ్రగ్స్ తయారీ యూనిట్ పై దాడులు నిర్వహించిన పోలీసులు 32 వేల లీటర్ల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఫ్యాక్టరీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు MD డ్రగ్స్, సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర లోని పూణే ప్రాంతానికి ఇక్కడి నుంచే డ్రగ్స్ వస్తున్న ట్లు గుర్తించి ఆ నెట్ వర్క్ ఛేదించే క్రమంలో హైదారాబాద్ లో డ్రగ్స్ గుట్టు వెలుగులోకి వచ్చింది
