HomeCRIMEసైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్..

సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్..

పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలిపోలీస్ కమిషనర్ సాయి చైతన్య హితవు..

సమాజం లో పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు పోలీస్ అధికారులు పాఠశాలలు , కళాశాలలో, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.

మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి బోధన్ ఏసిపి, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ , బోధన్ రూరల్ ఎస్సై , లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ లు నిర్వహించారు.

బోధన్ రూరల్ పీఎస్ పరిధిలోని రికార్డ్ లను పరిశీలిస్తూ , అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని , ప్రతి కేసులో నాణ్యమైన , ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి , అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలి అన్నారు.

ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్ట పరిచి అక్కడి పోలీసు సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారిచేసారు.

ప్రతి రోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలు చేశారు.

సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ, సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు.

గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24X7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని , దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని , సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.

ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు , బోధన్ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ , బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ , బోధన్ రూరల్ జె. మచ్చేందర్ , ఏడపల్లి ఎస్ఐ రమ , రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments