నిజామాబాద్ జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. గురువారం రాత్రి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, పోలీసులు చేపట్టిన దాడుల్లో రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వర్నిలో ఎనిమిది మంది అరెస్ట్* వర్ని మండలంలో కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం మేరకు సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 26,030 నగదుతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక కారు మరియు 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతీ నగర్‌లో ముగ్గురు పట్టివేత*మరో ఘటనలో నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని సరస్వతీ నగర్‌లో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ. 8,630 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఒకటవటౌట్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
