తెలంగాణ డిజిపి కొత్త డీజీపీ గా ఎవరిని నియమించాలనే విషయంలో రేవంత్ సర్కార్ ఎడతెగని కసరత్తులు చేస్తుంది. ఇంటలిజెన్స్ డిజి శివధర్ రెడ్డి వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.
కానీ సీనియార్టీ కోట లో సీవీ ఆనంద్ సైతం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ నెలఖారు లో డీజీగా జితేందర్ పదవి కాలం పూర్తీ అవుతుంది.తన పదవి కాలం మూడు నెలల పొడిగించాలని గట్టిగానే ప్రయత్నాలు చేసారు కానీ నిరాశే ఎదురైంది ..
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు పదవీ కాలం ను కేంద్రం పొడిగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సీఎస్ పదవి కాలం పొడగింపు కు కేంద్రం ఓకే చెప్పింది దీనితో జితేందర్ పదవి కాలం పొడింపు ప్రతిపాదనలను కేంద్రం పక్కకు పెట్టేసింది .
అసలు ఆయన పదవి కాలం పొడిగించే విషయంలో రేవంత్ సర్కార్ ఆసక్తిగా లేదనే ప్రచారం పోలీస్ వర్గాల్లో జరుగుతుంది. అందుకే కొత్త డిజిపి విషయంలో సీఎం రేవంత్ కసరత్తులు మొదలు పెట్టారని సమాచారం. సీనియార్టీ తో పాటు విధేయత లను ప్రామాణికంగా తీసుకొనున్నారు.
ఇందులోభాగంగానే రేవంత్ శివధర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ ఉంది.బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో శివధర్ రెడ్డి చాల కాలం ప్రాధాన్యత లేని పోస్టింగ్ లకు పరిమితం అయ్యారు.
కావాలనే ఆయనను వెంటాడింది.అందుకే రేవంత్ సీఎం అయ్యాక ఆయనే పోలీస్ శాఖ వెలుగు వెలుగుతున్నారు.
కింది పోస్టింగ్ ల్లోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సహజంగానే ఇంటిలిజెన్స్ చీఫ్ హోదా లో శివధర్ రెడ్డి కి రేవంత్ తో సన్నిహిత సంబంధాలు ఉంటాయి.
తనకు నమ్మకస్తుడిగా ఉన్న శివధర్ విషయంలో సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉంది అందులోనూ బిఆర్ యస్ ప్రభుత్వం హయాంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారని సానుభూతి ఉంది. వీటికి తోడు శివధర్ రెడ్డి సైతం వచ్చే ఏడాదే పదవి విరమణ చేయనున్నారు.
అందుకే అయన కు డిజి పి గా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.కానీ శివధర్ రెడ్డి కన్న రెండేళ్ల సీనియర్ గా ఉన్న సీవీ ఆనంద్ ఈసారి డీజీపీ విషయంలో పట్టుబడుతున్నారు.
సీనియార్టీ తో పాటు రెండు దఫాలుగా నగరసీపీ గా సమర్థవంతంగా పనిచేసిన ముద్ర ఉన్న నేపథ్యంలో డిజిజి బాధ్యత లు తనకు ఇవ్వాలని అయన వాదన గా ఉంది.
అందుకే ఈసారి ఢిల్లీ స్థాయిలో అయన లాబీయింగ్ చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరు సీనియర్ అధికారుల్లో ఎవరికి డిజిపి గా నియమించాలనే విషయం ప్రభుత్వ పెద్దలకు కత్తి మీద సాముగా మారింది
