పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో మీటింగ్ పెట్టింగ్ పెట్టి తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదని, ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
ఆయన బీజేపీ కి తోలుబొమ్మగా మారారని ఆయన మండి పడ్డారు. కాంగ్రెస్ గురించి శ్రద్ధగా చరిత్రలు చదువుకుంటే మంచిదని నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం గురించి తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ను అనాలంటే సినిమాల్లో డైలాగ్ చెప్పినట్టు కాదని మీ నాయకుడు మోడీ రాకెట్ ముందు ఫొటోలు దిగుతున్నారంటే అది కాంగ్రెస్ ఘనత అన్నారు.
విభజనకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు.. ఏ సినిమాల్లో ఉన్నాడని నిలదీశాడు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని ఆయన రాజకీయంగా చాలా చిన్నవాడన్నాడు.
బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో విభజన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. రెండు రాష్ట్రాలు వేరైన అన్నదమ్ములుగా కలిసి ఉందామని, తెలంగాణ రాజకీయాల కోసం మమ్మల్ని అంటే ఊరుకోనన్నారు.
అభివృద్ధి,సంక్షేమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ (BRS) ఎవ్వరు మాట్లాడటం లేదంటేనే వారి వెనుక ఒప్పందం ఏంటో అర్థం అవుతుందన్నారు.
