ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన చెల్లి మిస్సింగ్ అయినట్లుగా స్వయంగా మహిళ కమిషన్ ఛైర్మెన్ మాజీ మేయర్ విజయ లక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసారు రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసరాల్లో నివసించే తన సోదరి కె.నమ్రత (57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు.
అయితే, రోజుల గడుస్తున్నా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అక్క గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.తన చెల్లి మిస్సింగ్ వెనుక సతీష్ (35), సత్యనారాయణ (45), కుమారి (45) అనే ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని, వారిపై తనకు బలమైన అనుమానాలు ఉన్నాయని విజయలక్ష్మి తన ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఆమె ఆచూకీ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది
