విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన ముగ్పాల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది.
ముగ్పాల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ (HC 1173)గా విధులు నిర్వహిస్తున్న అంకడి గంగాధర్, సోమవారం నగరంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.
గంగాధర్ ఛాతీలో నొప్పితో బాధపడుతుండటాన్ని గమనించిన తోటి సిబ్బంది, వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానిక ఎస్సై, సిబ్బంది వెంటనే ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం నగరంలోని సిగ్మా హాస్పిటల్‌కు తరలించారు.అయితే, వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
విధులు నిర్వహిస్తుండగా గంగాధర్ మరణించడం పట్ల పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
