నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ గా, వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బి.వి. నాగమోహన్ రావును ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కీలక ఉత్తర్వులను విడుదల చేశారు.
ఆయన నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలకు ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా బదిలీ చేస్తూ డి.ఎం.ఇ. పేర్కొన్నారు.బదిలీ అయిన ప్రొఫెసర్ వెంటనే కొత్త స్థానంలో చేరాలని, సంబంధిత అధికారులు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
