బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సస్పెన్షన్ చేశారు, వివరాలలోకి వెళ్తే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు ఇవ్వవలసిన మెటీరియల్ ఉపాధ్యాయులకు ఇచ్చిన విషయంలో ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి ని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు, పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు మదన్మోహన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
