ప్రగతిశీల ప్రజాసౌమ్య విద్యార్థి సంఘం ( PDSU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి డి ఎస్ యూ జిల్లా అధ్యక్షులు ఆర్.గౌతం కుమార్,జిల్లా కార్యదర్శి ప్రిన్స్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు, విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ,విద్యార్థి సంఘాల నాయకులపై మోపిన అక్రమ కేసులను పి డి ఎస్ యూ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లాలో నిర్బంధంపై రాష్ట్ర ప్రభుత్వం,కాంగ్రెస్ పార్టీ MLA లు స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు PDSU -NSUI -SFI -AISF – PDSU -AIFDSU -AISB – AIPSU విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని బంద్ కు సహకరించాలని కోరుతూ బంద్ సందర్భంగా నగరంలోని రెయన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి వెళ్లగా అక్కడ మీరు మా కాలేజీలకే వస్తారా మేము బందు చేయము అని అంటూ విద్యార్థి సంఘ నాయకుల నాయకులపై దౌర్జన్యానికి పూనుకున్నారు,
నీట్ పేపర్ లీక్ అవుతే మాకేంటి ? పిరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటూ ఎగతాళి చేస్తూ బంద్ కు సహకరించాం , పోలీస్ కమిషనర్ మాకు బాగా తెలుసని వారి ఇంటి దగ్గర ఫంక్షన్స్ అన్ని మేమే చేస్తాం బంద్ కు మేం సహకరించాం అన్నారు.
బంద్ చేయమని అంటే డబ్బులు అడిగామని ఆరోపణ చేస్తూ కేసులు పెడతామని చేతులు విరిగాయని కాళ్ళు విరిగాయని EX RAY లు తీసుకువచ్చి కేసులు పెడతామని యాజమాన్యం బెదిరించింది.
యాజమాన్యంపై పోలీస్ స్టేషన్ లో విద్యార్థి సంఘాలు కేసు పెడితే దాని మీద కేసు బుక్ చేయలేదు కానీ, విద్యార్థి సంఘ నాయకులపై (యాజమాన్యం పై ఉన్న ప్రేమ తో) తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.నిన్నటి దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాన్ని గిట్టని కొందరు నిన్న మీడియా ముసుగులో తప్పుడు వార్తలు రాశారు.
తప్పుడు కేసులు బనాయించిన యాజమాన్యం కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని అలాగే ఈ ఘటన పైన సిపి గారు విచారణ జరిపి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులకి భయపడి విద్యార్థి ఉద్యమం ఏనాడు వెనకడుగు వేసిన దాఖలాలు లేవని వారు తేల్చి చెప్పారు.
ఒకటి, రెండు కాలేజీలు విద్యార్థులకు పాఠాలు చెప్పే దానికన్నా తప్పుడు కేసులు బనాయించే దాంట్లో ప్రావీణ్యం సాధించిందని మండిపడ్డారు
రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ చేస్తున్న తప్పుడు దందాలను వెలికి తీస్తామని కచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు ఆకాష్, మనోజ్, పవన్, భవాని, శ్రీకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
