HomeTelanganaNizamabadగురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం అదుకొవాలి..

గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం అదుకొవాలి..

గురుకుల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం స్పందించి వెంటనే అదుకొవాలనీ ఐ యూ ఎమ్ ఎల్ నేతలు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మొహమ్మద్.షకీల్
ఐ యూ ఎమ్ ఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశానుసారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా నాయకులు స్పందించి తమ తమ జిల్లాల్లో గురుకుల ఉద్యోగుల తరఫున మెమొరండం అందజేశారు.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపున మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్రంలోని 20,000 మంది ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు అందట్లేదు గురుకులాల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ డైలీవెజ్ కార్మికుల పరిస్థితి దయనియంగా మారింది

వారి కుటుంబ పోషణ భారంగా మారుతుంది ముఖ్యంగా కుకింగ్ స్టాఫ్ ప్లంబర్ ఎలక్ట్రిషన్ సెక్యూరిటీ వంటి స్టాఫ్ ను ఔట్సోర్సింగ్ నుండి తీసి డైలీ వెజ్ కేటాగిరికి మార్చడం వలన వారి స్థితి దయనియంగా మారింది

జీతాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి చాలీచాలని అరకోరా జీతాలతో పని చేస్తున్న వారికి నెలలు నెలలు జీతాలు ఆపడంతో ఇంటి అద్దెలు పిల్లల స్కూల్ ఖర్చులు వైద్య ఖర్చులకు ఇతరుల దగ్గర అప్పులు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గురుకులాల్లోని టీచింగ్ నాన్ టీచింగ్ వారికి 12 నెలల జీతం ఇవ్వాల్సి ఉండగా ఏప్రిల్ వరకు ఇవ్వడం సమంజసం కాదని ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తుంది

రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ గురుకుల ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 3000 మంది మైనార్టీ ఉపాధ్యాయులు జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున మేం ప్రభుత్వాన్ని కోరుతున్నది

అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సకాలంలో ప్రతి నెల మొదటి వారంలో వారికి జీతాలు అందించాలని పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం

ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోనే కాకుండా ఉద్యోగుల్లోనూ నమ్మకం కోల్పోతుందని కాబట్టి వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించాలని

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతుందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments