HomeCRIMEనగరం లో ఆల్ఫాజోలం పట్టివేత...

నగరం లో ఆల్ఫాజోలం పట్టివేత…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కృత్రిమ కల్లు తయారీలో వాడే నిషేధిత ఆల్ఫాజోలం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఏఈఎస్ శ్రీనివాస్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

ఎక్సైజ్ ప్రోహిబేషన్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నగరంలో రూట్ వాచ్ నిర్వహిస్తున్న సమయంలో కోజా కాలానికి చెందిన అబ్దుల్ మాలిక్ దేవని ద్విచక్ర వాహనం లో కృత్రిమ కల్లు తయారీలో వాడే నిషేధిత 609 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ మేరకు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న,ఎస్ఐ రాంకుమార్, హెడ్ కానిస్టేబుల్ రాజన్న,నారాయణ రెడ్డి, కానిస్టేబుల్లు హమీద్,శివ, శ్యామ్ సుందర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments