నిజామాబాద్ మున్సిపాలిటీలో జూన్ 2, 2025 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు అమలు చేసిన 100 రోజుల మున్సిపల్ యాక్షన్ ప్లాన్ (100 రోజుల కార్యాచరణ ప్రణాళిక) ముగిసింది.
ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం పట్టణాల సుస్థిర అభివృద్ధిని సాధించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, క్లీన్ అండ్ గ్రీన్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించడం.
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించారు . ఈ ముగింపు ర్యాలీ నీ మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు తీసి ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది నీ అభినందిస్తూ ఇదే స్పూర్తి తో భవిష్యత్ లో పని చేస్తూ నగరం నీ పరిశుభ్రంగా , స్వచమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
అదేవిధంగా బాగా పనిచేసిన అధికారుల ను , సిబ్బంది కి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆడిషన్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డివైఈఈ, ఏఈ, శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
