(టీఎస్‌ఆర్టీసీ)లో ఎన్నికల కోలాహలం మొదలైంది గుర్తింపు కార్మిక సంఘం కోసం జరిగే ఎన్నికల ను . సీక్రెట్ బ్యాలెట్ తో నిర్వహించనున్నారు
ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న 12 కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారి, జాయింట్ లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.. కార్మిక సంఘాలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కాగా… గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 9న జరగనుంది.
/// ఏ సంఘానికి ఏ గుర్తు ////
- ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ): బస్సు
- తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ): నిచ్చెన
- స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్.డబ్ల్యు.ఎఫ్): నక్షత్రం
- నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ): దివిటీ పట్టుకున్న చేయి
- కార్మిక సంఘ్: పులి
- కార్మిక పరిషత్: బస్సు టైరు
- బహుజన వర్కర్స్ యూనియన్: కత్తెర
- తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్: విల్లు-బాణం
- స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్: త్రాసు
- సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్: బతుకమ్మ
- బహుజన కార్మిక యూనియన్: ధర్మ చక్రం
12 ) తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్: గద
