యూరియా కొరత ను నిరసిస్తూ రైతుల ఆందోళన లు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లో గురువారం ఉదయం వందలాది మంది రైతులు వచ్చి రోడ్డు మీద బైటాయించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోడ్డుకు ఇరువైపులా వాహనాల నిలిచి పోయాయి ట్రాఫిక్ స్తంభించడంతో కామారెడ్డి సీఐ నరహరి హుటాహుటి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పారు టోకెన్ విధానం తో యూరియా పంపిణీ చేసేలా అధికారులతో మాట్లాడుతానని రైతులకు నచ్చ జెప్పి వారందరిని మార్కెట్ యార్డు కు తీసుకెళ్లారు.
