నిజామాబాద్ నగరంలో దేవి శరన్న నవరాత్రి ఉత్సవాల సందడి మొదలయ్యాయి.
ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చంద్రనగర్ కాలనీలో అమ్మవారి మండపానికి భూమి పూజను వేదపండితుడు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.కాలనీ అధ్యక్షులు, స్థానిక నివాసులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి, శ్రేయస్సుకు అమ్మవారి దివ్యకృప కలగాలని ప్రార్థనలు చేశారు. నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఈ భూమి పూజతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
