HomePOLITICAL NEWSAndhra Pradeshతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనానంతరం ఆలయ వెలుపల ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “సకల జనుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నాను” అని తెలిపారు.


ప్రజలందరికీ శ్రీవారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments