ఈ రోజు ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ,కామారెడ్డిలో బీసీ సభ పేరుతో మైనార్టీ సభ నిర్వహించడం దురదృష్టకరం.
వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ ఏంటో ప్రజలకు అర్థం అయింది వరద బాధితులకు కామారెడ్డిలో 11,500 రూపాయలు పంపిణీ చేశారు కానీ దాని కన్న ఎక్కువ నష్ట పోయిన సిరికొండ, దర్పల్లి, బీంగల్, వాడి, నడ్మి తండా, బీరప్ప తండా, కొండూరు, గడ్కోల్, ఒన్నాజిపేట, పెద్ద వల్గొట్, చిన్న వల్గొట్, సాలూర, నవీపేట్, రెంజల్ గ్రామాల్లో ప్రజలు అన్నీ కోల్పోయారు.
అక్కడ ఎవరైనా బతికి ఉన్నారా లేదా అనే లెక్కలు కూడా ఏమైనా ఉన్నాయా లేదా ప్రజల బాధలు మీకు అక్కర లేదా మా రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మరియు మా MLA మాత్రం ఫొటో షూట్లలో మునిగిపోయరు.
అతను డాక్టర్ వృత్తి మర్చిపోయి షూట్ లకు టైం కేటాయించడం సిగ్గు చేటు ఇందూరు జిల్లాలో ఎంత నష్టం జరిగిందో ఇక్కడ పర్యటిస్తున్న మంత్రులకు అవగాహన ఉన్నదా? వరద బాధితులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మేము కోరినా, జిల్లా యంత్రాంగం స్పందించలేదు. మా పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి MLA ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా IMA డాక్టర్ లతో నేను మాట్లాడి హెల్త్ క్యాంపులు నిర్వహించను కామారెడ్డిలో సభ కోసం మంత్రి సీతక్క కొన్ని రోజులుగా అక్కడే గడుపుతూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది కానీ ప్రజల వద్దకు వెళ్లలేదు. బాధితల కు న్యాయం చేయలేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి.
బీసీల పేరుతో సభ పెట్టి మైనార్టీ ఓట్లు సాదించడమే వారి లక్ష్యం. జిల్లాలో 6 నియోజకవర్గాలకు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు ఇంచార్జిగా లేరా? బీసీలను మోసం చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిర్గతం చేయాలి.
ఇదే కాకుండా, ముదిరాజ్ బిడ్డ అయిన మంత్రి శ్రీధర్ రావు గారు ఈ రోజు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అభివృద్ధి కోసం కాదు ముఖ్యమంత్రి మోప్పు కోసం పర్యటన చేస్తున్నారు.అని మాకు సృష్టంగా అర్ధం అయింది మా డిమాండ్ స్పష్టంగా ఉంది మైనార్టీలను మినహాయించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. దీని కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
ఈ నెల 15న కామారెడ్డిలో జరుగుతున్న సభ బీసీలకు సంబంధం లేదు. అది పూర్తిగా మైనార్టీ సభ. అందువల్ల బలహీన వర్గాలు, బీసీ సంఘాలు ఆ సభకు దూరంగా ఉండాలి అ సభ ను బహిష్కరించాలని కోరుతున్నాం మహేష్ కుమార్ గౌడ్ ను సాకుగా చూపి బీసీలను నిండా ముంచుతున్నారు కాంగ్రెస్ బీసీ ల వ్యతిరేకి కాంగ్రెస్ నాయకులు బిజెపి మీద మాట్లాడం మానుకోవాలి లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, కార్పొరేటర్లు ప్రమోద్, మాస్టర్ శంకర్,మల్లేష్ గుప్తా,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, జిల్లా కార్యదర్శి దాంపల్లి జ్యోతి, జిల్లా మీడియా ఇంచార్జి పుట్ట వీరేందర్ జిల్ల కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి,అంబదాస్,నాగరాజ్, హరీష్ రెడ్డి, సందీప్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
