HomePOLITICAL NEWSkamareddyకామారెడ్డి బీసీ సభ వాయిదా..

కామారెడ్డి బీసీ సభ వాయిదా..

ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ చేశారో అక్కడే బీసీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.కానీ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నెల 15 న కామారెడ్డి లో జరిగే ఈ సభను వాయిదా వేస్తూ అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సభ ఏర్పాట్లు,జన సమీకరణ కోసం ఇదివరకే ఇంచార్జి మంత్రులు కూడా జిల్లాలో పర్యటిస్తూ సమావేశాల ద్వారా కార్యకర్తలను సిద్ధంచేస్తున్నారు ఈసందర్భంగా శుక్రవారం మంత్రి శ్రీహరి నగరంలోని రూరల్ ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ.. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంచిందనీ తెలిపారు. అది ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ, బీసీలకు 42 శాతం కోటా పెంచుతూ జీవో జారీ చేసింది.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించామని, అనంతరం బీసీ(BC)లకు న్యాయం చేసేందుకు కృషిగా చేస్తున్నట్లు తెలిపారు.

కామారెడ్డి సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, పీసీసీ చీఫ్ మహేశ్ నేతృత్వంలో రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు,అలాగే తరువాత తీసుకోబడే సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ సభనిర్వహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను బీసిల కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ అడుకుంటున్నాయని తెలిపారు.అలాగే దేశంలో బడుగు బలహీనతల వర్గాల విద్యార్థులకు విద్య ఉద్యోగాలు, రాజకీయం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆలోచన చేసిందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

ఈ పాదయాత్రలో ఆయన గమనించిన ముఖ్య విషయం బడుగు బలహీనతల వర్గాలు వెనకబడి ఉన్నందున ప్రజలు ఉన్నతంగా ఎదగాలని ఏరివల రాష్ట్రంలో కుల గణన చేశారని అన్నారు.అందుకు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో వెనకడుగు వేస్తుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments