HomeDevotionalసర్వ సమాజ్ కమిటీ పై విమర్శల వెల్లువ.. ఏళ్ల తరబడి పాతుకుపోయారంటూ ఆగ్రహం

సర్వ సమాజ్ కమిటీ పై విమర్శల వెల్లువ.. ఏళ్ల తరబడి పాతుకుపోయారంటూ ఆగ్రహం

కీలక సమావేశంలో రసాభాసనగరంలో ప్రతి ఏటా ఆషాఢమాసం లో జరిగే ఊర పండుగను నిర్వహించే సర్వ సమాజ్ కమిటీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కమిటీ లో పాలక వర్గం లో కొందరు ఏళ్ల తరబడిగా పాతుకుపోయి ఉండడంపై ఆయా సామాజిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది వీల తరబడిగా నాలుగు ఐదుగురే పెత్తనం సాగించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ఆదివారం నగరంలోని సిర్నపల్లి గడిలో సర్వ సమాజ్ కమిటీ సమావేశం జరిగింది వచ్చే నెలలో జరిగే ఊర పండగకు సంబంధించిన ఏర్పాట్లు చర్చించడానికి జరిగిన ఈ సమావేశం రసాభాసగా మారింది.

ఎల్లమ్మ గుట్టకు చెందిన సీనియర్ నాయకుడు రేంజర్ల గంగాధర్ కమిటీ పెద్దల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. సర్వ సమాజ్ కమిటీలు ఒకే పార్టీకి చెందిన నేతల పెత్తనం మితిమీరి పోయిందంటూ మండిపడ్డారు. ఆయన సర్వసమాజ్ కమిటీ పాలకవర్గం ఇంతకాలం కొనసాగుతుందని ప్రశ్నించారు.

తమ రాజకీయ అవసరాల కోసం కొందరు సర్వ సమాజ్ కమిటీని వేదికగా మార్చుకున్నారని మండిపడ్డారు. నగరంలో అనేక సామాజిక వర్గాలు ఊర పండుగ యాక్టివ్ గా పని చేస్తాయని కానీ కొన్ని సామాజిక వర్గాలకే సర్వసమాజ్ కమిటీ లో ప్రాతినిద్యం ఉందని గుర్తుచేశారు.

ముఖ్యంగా ఒకే సామాజిక వర్గం నేతలు సర్వసమాజ్ కమిటీని తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఆషాఢ మాసంలో నగరంలో వీధివీధిలో ఊర పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆయా ప్రాంతాలలోని సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు సర్వసమాజ్ కమిటీ వేదికగా ఈ పండుగను నిర్వహిస్తారు.

కానీ ఏళ్ల తరబడిగా సర్వసమాజ్ కమిటీలో పాతుక పనిచేస్తున్నారు. కొత్త వారికి ఎంట్రీ ఇవ్వక పోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జరిగే సమావేశంలో రెంజర్ల గంగాధర్ సైతం ఇదే అంశాలను ప్రస్తావించారు

పాలకవర్గం ఎంత కాలం కొనసాగుతారని నిలదీశారు సర్వ సమాజంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అలాగే కొన్ని సంఘాలను సైతం కమిటీలో చోటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు అయితే ఎవరో పండుగ ఏర్పాట్లు చేయాల్సి ఉందని కమిటీ పునర్వవ్యస్థీకరణ సంగతి త్వరలో చూద్దామని కొందరు పెద్దలు సర్ది చెప్పడంతో గంగాధర్ వెనక్కి తగ్గారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments