HomePOLITICAL NEWSUncategorizedకాంగ్రెస్ నేత ను పెట్రోల్ పోసి నిప్పంటించారు .......వరంగల్ లో దారుణం...

కాంగ్రెస్ నేత ను పెట్రోల్ పోసి నిప్పంటించారు …….వరంగల్ లో దారుణం…

వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పోట్రోల్ పోసి తగల బెట్టే యత్న చేసారు కాంగ్రెస్ పార్టీ, 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు మహేష్‌ఫై ఈ దాడి జరిగింది .

శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మహేష్ బైక్‌పై ఎన్టీఆర్ నగర్‌లోని తన ఇంటి వెళ్తున్నాడు. మార్గమధ్యలో కాపుకాచిన దుండగులు అతడిని అడ్డుకున్నారు.

క్షణాల వ్యవధిలోనే తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌‌ను మహేష్‌పై పోసి నిప్పంటించి పారి పోయారు ఒంటికి మంటలు అంటుకోవడంతో మహేష్ పరుగులు తీస్తూ ఎన్టీఆర్ నగర్‌లోని స్థానికుల వద్దకు చేరుకున్నారు.

ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments