హైదరాబాద్ పాతబస్తీలో కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి దారుణ హత్య కు గురయ్యాడు కాలాపత్తర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు, వ్యక్తిగత లేదా ఇతర విభేదాలు ఏమైనా కారణమా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పండగ రోజున యువ విద్యార్థి హత్యకు గురికావడంస్థానికంగా కలకలం రేపింది
