HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్

ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు అశాస్త్రీయమైన ఆందోళనలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్న ఎమ్మెల్యే ఇంటికి ఒక్క కాంగ్రెస్ నాయకుడు వస్తే, వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ఇందూరు ప్రజలు చలో అంకాపూర్ పిలుపుతో కదిలివస్తారని హెచ్చరించారు.

రేపు జరగబోయే ఎటువంటి పరిణామాలకైనా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డిల ఇళ్లను కూడా ముట్టడిస్తామని దినేష్ సవాల్ విసిరారు.

రాకేష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే ఆయనకు శ్రీరామరక్ష అని, వాటిని చూసే కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని దినేష్ ఎద్దేవా చేశారు. రూ. 200 కోట్లతో ప్రతిష్టాత్మక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండటం.

ఆర్మూర్ నియోజకవర్గంలోని 92 గ్రామాలకు 3 వేల ఇళ్ల మంజూరు. ఆర్మూర్ మున్సిపాలిటీకి రూ. 45 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన అభివృద్ధి పనులు. అసెంబ్లీ వేదికగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై గొంతెత్తి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందేలా కృషి చేయడం. కేంద్రం నుండి ‘అమృత స్కీం’ కింద రూ. 43 కోట్లు నిధులు తీసుకురావడం.

డొంకేశ్వర్ మండలంలో నూతన ఎంఆర్వో కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. రూపాయి అవినీతికి తావులేకుండా నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల అభివృద్ధి పనులను రాకేష్ రెడ్డి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని దినేష్ గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న, ప్రధాన కార్యదర్శి పోతంగర్ లక్ష్మీనారాయణ, నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదాల నరేష్, జ్యోతి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓంసింగ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, సంతోష్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments