భారత ప్రథమ హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దూర దృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై తెలంగాణ ప్రజలు విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ సంస్థానం యూనియన్ లో కలిసిన సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఇందూరు నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కార్గిల్ చౌరస్తాలో ఆయన జాతీయ జెండా ను ఎగురవేసి అనంతరం ప్రసంగించారు.
నిరంకర నిజాం రజాకార్ల కు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధులు చిరస్మరణీయులని ఆయన తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని యూనియన్ లో కలపడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని ఆయన చెప్పారు
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దుర్గాదాస్,సునీల్,అజయ్,పూర్వ రాష్ట్ర నాయకులు ఎ రాకేష్ సాయి తదితరులు పాల్గొన్నారు
