HomeCRIMEఫైనాన్స్‌ సిబ్బందిపై కత్తితో దాడి..డబ్బులు అడిగారని కత్తితో పొడిచిన నిందితుడు.. అరెస్టు

ఫైనాన్స్‌ సిబ్బందిపై కత్తితో దాడి..డబ్బులు అడిగారని కత్తితో పొడిచిన నిందితుడు.. అరెస్టు

నిజామాబాద్‌ క్రైమ్: ఫైనాన్స్‌ బకాయిలు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని ఆటోనగర్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

ఆరవ టౌన్ ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌కు చెందిన షేక్‌ సబి ఇంటికి ఆర్‌బీఎల్‌ ఫైనాన్స్‌, శాటిన్‌ క్రెడిట్‌ కేర్‌ లిమిటెడ్‌ సంస్థల సిబ్బంది రికవరీ కోసం వెళ్లారు.

సబి వదినను నెలవారీ వాయిదాలు చెల్లించాలని కోరారు.దీంతో ఆగ్రహించిన సబి.. ఫైనాన్స్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో రాకేశ్‌, రాజు గాయపడ్డారు.

అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోతున్న సిబ్బందిని మళ్లీ డబ్బుల కోసం ఇంటికి వస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సబిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments