త్వరలో జరిగే రెండు ఎమ్మెల్యే ఎన్నికల స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని ఎంపిక చేసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో పేర్లు ఖరారైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్న సమయంలో సర్వోత్తమ్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
ఈ స్థానానికి ఆయనతోపాటు పలువురు ఆశావహులు పోటీలో ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే చివరి దశలో సర్వోత్తమ్‌రెడ్డి పేరును అధిష్ఠానం ఖరారు చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడైన సర్వోత్తమ్‌రెడ్డికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల్లో రాజకీయ పరిచయాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
సర్వోత్తమ్‌రెడ్డి అభ్యర్థిత్వం వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యూహం ఉందనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
//పీసీసీ చీఫ్ ను కల్సిన అభ్యర్థుల/////
ఎమ్మెల్సీ అభ్యర్థులు రాం మోహన్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లు బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కల్సి ధన్యవాదాలు తెలిపారు
