HomePOLITICAL NEWSNationalభూపతి రెడ్డి.. ఎవరి చెవుల్లో పువ్వు పెడ్తున్నావ్?..అర్సపల్లి ఆర్వోబీకి నిధులన్నీ కేంద్రానివే.. రాష్ట్రం తన బాధ్యత...

భూపతి రెడ్డి.. ఎవరి చెవుల్లో పువ్వు పెడ్తున్నావ్?..అర్సపల్లి ఆర్వోబీకి నిధులన్నీ కేంద్రానివే.. రాష్ట్రం తన బాధ్యత నిర్వర్తించాలి..మాధవ్‌నగర్ ఆర్వోబీ అదనపు నిధులకు రెండేళ్లుగా అనుమతులేవీ? అనుమతులివ్వాలి: ఎంపీ అర్వింద్

అర్సపల్లి ఆర్వోబీ నిధుల విషయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఘాటుగా విమర్శించారు. అర్సపల్లి ఆర్వోబీకి 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు విడుదల చేసి కేంద్రానికి బిల్లులు రైజ్‌ చేసిన 48–72 గంటల్లోనే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయని తెలిపారు. బుధవారం విడుదలైన రూ.14.77 కోట్లలో రూ.13.65 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులేనని వెల్లడించారు.

కేంద్ర నిధుల విడుదల కోసం రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను తాను పలుమార్లు కోరినట్లు అర్వింద్‌ పేర్కొన్నారు. “కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో మాకు తెలుసు.. మాకు సలహాలు అవసరం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి” అని స్పష్టం చేశారు.మాధవ్‌నగర్‌ ఆర్వోబీకి సంబంధించి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధులకు పరిపాలనా అనుమతులు ఎవరు ఇప్పించాలంటూ భూపతిరెడ్డిని అర్వింద్‌ నిలదీశారు.

“భూపతిరెడ్డి.. అనుమతులు ఇప్పిస్తావా? లేదా?” అని ప్రశ్నించారు. పరిపాలనా అనుమతులు రాకపోవడంతో ఆర్వోబీ రెండో వైపు కాంట్రాక్టర్‌ పనులు కొనసాగించే పరిస్థితి లేదన్నారు.ప్రజలకు అత్యవసరమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని అర్వింద్‌ పేర్కొన్నారు.

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. అనుమతులు ఇవ్వకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున పోరుబాట చేపడతామని హెచ్చరించారు. మాధవ్‌నగర్‌ ఆర్వోబీ పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments