HomeCRIMEద్విచక్ర వాహనం పై కిందపడి ఇద్దరు మృతి. ఒకరికి గాయాలు..

ద్విచక్ర వాహనం పై కిందపడి ఇద్దరు మృతి. ఒకరికి గాయాలు..

ద్విచక్ర వాహనం పై కిందపడి ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన దాస్ నగర్ – మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ..

ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరాడి చింటూ (30) తన భార్య పూజా (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్‌పై నిజామాబాద్ వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో మాక్లూర్ – దాస్ నగర్ మధ్యలో చింటూ నడుపుతున్న బైక్ అదుపు తప్పి క్రింద పడగా నారాయణ తీవ్రగాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

చింటూ, పూజా లకు గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ పూజా కూడా మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం చింటూ చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటనపై మాక్లూర్ ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments