నగరంలో పేకాట స్థావరం పై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..నగరంలోని సుభాష్ నగర్ లో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వారినుంచి రూ 17000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
