సీఎం రేవంత్ రెడ్డి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టర్లు విడుదల చేసిన వ్యక్తిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సిపి కి వినతి పత్రం అందజేశారు.
ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ ప్రభుత్వం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఓ ఓ తో కావాలనే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ మేరకు వెంటనే ఆ వ్యకి ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు శాంతంగా ఉండాలని సూచించారు.
ఎవ్వరు కూడా అనవసరంగా రోడ్లపై అల్లర్లు చేయకూడదని లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి విఘాతం కలిగించకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్,రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.
