Tuesday, April 28, 2026
HomeTelanganaNizamabadబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి..రేపటి బీసీ బంద్...

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి..రేపటి బీసీ బంద్ కు తెలంగాణ జన సమితి మద్దతు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా రంగంలో, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జన సమితి ఆద్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు దువ్వ వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చవలనీ తెలిపారు.

వెనుకబడిన వర్గాలకు (బీసీలు) రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను పెంచాలని సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

సమగ్ర కుల గణన అనంతరం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును, అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందనీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి పార్లమెంటులో చట్టం చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ ఆరోపించారు.

ఫలితంగా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో నష్టం కలుగనున్నదనీ అన్నారు. అందువలన, కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించవలసినదిగా కోరారు.

బిల్లును తక్షణమే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రక్షణ కల్పించవలసిందిగా, ఆచరణలోకి తేవలసిందిగా విన్నవించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ నేతలు మర్రి కిరణ్,తమలపాకుల గంగాధర్,సుంకరి గంగాధర్, సలీం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!