భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తం అయింది. ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మొంథా’ తుపాను ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుంది.
బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీన పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను కారణంగా రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
