వానాకాలం పంటలు చేతికొచ్చే వేల మరోసారి అకాల వర్షాలతో రైతులు దిగాలు చెందుతున్నారు. మెంథా తుపాన్ ప్రభావం తో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి దీనితో అనేక ప్రాంతాల్లో వరి కోతలు చివరి దశ కు వచ్చాయి ప్రభుత్వం ఈపాటికే వరి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.
దీనితో వడ్లను అమ్ముకోవడానికి వీలుగా ఎప్పటిలాగే వడ్ల ను రోడ్ల మీదే ఆరబెట్టారు. ఎప్పుడు వర్షాల పడుతాయో తెలియక వడ్లు ఆరబెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి.
