Saturday, May 2, 2026
HomeEditorial Specialసీసీ యస్ ప్రక్షళన ఎప్పుడో ? దిద్దుబాటు కు నడుకట్టిన సీపీ ……..

సీసీ యస్ ప్రక్షళన ఎప్పుడో ? దిద్దుబాటు కు నడుకట్టిన సీపీ ……..

ప్రమోద్ హత్య తరువాత సీసీఎస్ ను పూర్తీ స్థాయిలో ప్రక్షళన చెయ్యాలనే వాదన వచ్చింది. ఎలాంటి రౌడీ షీట్ లేని ఘరానా దొంగ రియాజ్ ఈ ఘాతకాని కి పాల్పడ్డాన్ని క్రింది స్థాయి పోలీసులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు.

రియాజ్ ఎన్ కౌంటర్ లో హతం అయిన నేపథ్యంలో సీసీఎస్ లో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. రియాజ్ కు సన్నిహితుడైన సమద్ సీసీ యస్ బలమైన నెట్ వర్క్ ఉన్నట్లు స్పెషల్ బ్రాంచ్ సైతం కమిషనర్ కు ఉప్పందించాయి.

సీసీఎస్ లో సమద్ కు ఎవరెవరు టచ్ లో ఉన్నారనేది అరా తీస్తున్నారు. ఇప్పటికే సమద్ కోసం ప్రత్యేక బృందం ఇంకా గాలిస్తూనే ఉంది.మరో వైపు టాస్క్ ఫోర్స్ తరహాలోనే సీసీ యస్ ను సైతం పూర్తీ స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి.

బాధ్యతలు చేపట్టిన మొదట్లోనే జిల్లాలో అసాంఘిక శక్తుల తాకిడి ని ముందే అంచనా వేసిన సీపీ సీసీఎస్ ను సైతం అప్రమత్తం చేసారు. గతంలో ఎప్పడు లేని విధంగా ఆయుధాలు సైతం సమకూర్చారు. కానీ ఘరానా దొంగ రియాజ్ ను పట్టుకోవడానికి వెళ్లిన ముగ్గురి లో ఓ ఒక్కరి వద్ద కూడా ఆయుధం లేక పోవడం వల్లే రియాజ్ తెగించేలా చేసింది.

అప్పుడే విధులు ముగించుకొని తన ఆయుధం ఇంట్లో భద్రపరిచి ఆసుపత్రికివెళ్లిన ప్రమోద్ కు అత్యవసరంగ రియాజ్ ఆపరేషన్ కోసం తీసుకెళ్లారు. నిజానికి ప్రమోద్ వెంట ఎస్సై మరో కానిస్టేబుల్ సైతం వెళ్ళాడని చెప్తున్నారు. వారుకూడా తమ ఆయుధాలు ఇంట్లోనే భద్రపరిచారు.

ఓ ఘరానా దొంగ ను పట్టుకొని స్టేషన్ కు తరలించే విషయంలో కనీసం ఉన్నతాధికారులు సైతం గైడ్ చెయ్యలేక పోయారనే విమర్శలు పోలీస్ వర్గాల్లోనే ఉన్నాయి. అదీగాక ఒకరిద్దరు కానిస్టేబుళ్లు అధికారుల అండగా తో యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే సీపీ దాక వెళ్లాయని సమాచారం.

అందుకే టాస్క్ ఫోర్స్ తరహాలోనే సీసీ యస్ ను సైతం పూర్తీ స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కార్యాచరణ సిద్ధం అవుతుంది. చురుకైన కొంత మంది కానిస్టేబుళ్ల తో పాటు ఒకరిద్దరు అధికారులతో సీసీ యస్ ను మరింత పటిష్టంగా చెయ్యాలనేది సీపీ ఆలోచనగా వుందని చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!