పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సాయి చైతన్య పాల్గొని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మా అమర వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజ సేవలో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటం కూడా ఒక మహత్తర సేవ” అన్నారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు హెల్మెట్ లు, జ్యూస్ అరటి పండ్ల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఏ ఆర్ అడిషనల్ డీసీపీ రామచందర్ రావు, అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
