Saturday, May 2, 2026
HomeCRIMEపోక్సో కేసులో నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష...కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష…కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద నిందితునికి జీవిత ఖైదు శిక్ష, రూ 30 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి సి హెచ్ వీ వి ఆర్ వర ప్రసాద్ తీర్పు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్లితే..

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తి 8వ తరగతి చదువుతున్న తన కూతురు ఇంటి ప్రక్కన ఉండే వరుసకు నానమ్మ ఇంటిలో కేజీబీవీ స్కూలు నుండి సెలవులకు వచ్చినప్పుడు రాత్రిపూట వెళ్లి పడుకునేది.

దసరా సెలవులకు వచ్చిన సందర్భంలో రాత్రి వెళ్లి పడుకున్న సమయంలో ఇంటి ప్రక్కన ఉంటున్న భూక్యా గణేశ్ తన కూతురిని నిద్రలో నుండి లేపి అరిస్తే చంపేస్తా అని భయపెట్టి బలవంతంగా శారీరక బలత్కారం చేశాడని తర్వాత ఆ విషయం ఎవరికి చెప్పద్దు అని బయపెట్టినట్లు తెలిపారు.

తర్వాత స్కూల్లో కొద్దిరోజుల తర్వాత అనారోగ్యంనికి గురి కావడంతో తన కూతురు భూక్యా గణేశ్ శారీరక బలత్కారం చేశారని 2018 జనవరిలో మాచారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసులో బాధితురాలితో సహా వారి ఇంటివారిని, చుట్టుపక్కల వారిని విచారించి నిందితుడు భూక్యా గణేశ్ ను అరెస్టు చేసినారు. అన్ని రకాల సాక్షాదారాలు అన్నింటిని సేకరించి పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.

కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని జిల్లా న్యాయమూర్తి సి హెచ్ వీ వి ఆర్ వర ప్రసాద్ నిందితునికి జీవిత ఖైదు శిక్ష, ₹30,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి కామారెడ్డి డిఎస్సి టి. లక్ష్మీనారాయణ, మాచారెడ్డి ఎస్ హెచ్ ఓ యం. కృష్ణ మూర్తి.

పోలీసు తరపున వాదనలు వినిపించిన అదనపు ప్రాసిక్యూటర్ శేషు , కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ని, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్, అనిల్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ రామేశ్వర్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్లు వి. జానకి రామ్,. హరిప్రసాద్, ప్రకాష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!