ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ను ఎంపీ అర్వింద్ బుధవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు .
ఈ సందర్భంగా గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాధవ్ నగర్, అర్సపల్లి మరియు అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించి సుమారు 13.5 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు .
మంత్రి భట్టి సానుకూలంగా స్పందించి, పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదలయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు .
