HomeCRIMEఇసుక క్వారీని పరిశీలించిన మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు ....

ఇసుక క్వారీని పరిశీలించిన మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు ….

పోతంగల్ మండలం కోడిచెర్ల శివారులోని ఇసుక క్వారీని మంగళవారం జిల్లా మైనింగ్ శాఖ అధికారులతో పాటు పోలీసు రెవెన్యూ అధికారులు పరిశీలించారు సోమవారం ఇసుక రవాణాకు వచ్చిన టిప్పర్లను స్థానికులు అడ్డుకొని నిరసన తెలపడంతో పాటు అధికారులపై ఆరోపణలు చేయడం జరిగింది

రెవెన్యూ మైనింగ్ పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆందోళన చేపట్టడంతో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం రైతు పట్టా భూమిలోని ఇసుక మేటలను పరిశీలించారు

ఈ సందర్భంగా తాసిల్దార్ గంగాధర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు తాము సహకరించలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు రైతు పట్టా భూమిలో ఇసుక మీటలు ఉన్నాయని కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ ఇసుక రవాణాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు సర్వే నంబర్ 334 లోని పంట భూమిలో మాత్రమే ఇసుక తవ్వకాలు చేశారు

అని ప్రభుత్వ భూమిలో ఇసుక తవ్వకాలు చేపట్టలేదు అని ఆయన తెలిపారు తాము ఇచ్చిన అనుమతుల మేరకు ఇసుక పూర్తి అయిపోయిందని ఇక ఇసుక తవ్వకాలు జరిపేది లేదు అని తాసిల్దార్ స్పష్టం చేశారు తమ విధులను అడ్డగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది

అని కేసులు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు ఇసుక పాయింటును పరిశీలించిన వారిలో జిల్లా మైనింగ్ అధికారి నాగేశ్వర్ బోధన్ ఏసిపి శ్రీనివాసరావు తాసిల్దార్ గంగాధర్ ఎస్సై సునీల్ రెవిన్యూ సిబ్బంది ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments