పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఇందల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కోటగిరి మండలం రాయకూరుకు చెందిన నీరాడి సురేష్(35) ఇందల్వాయి రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో అటు వైపుగా వెళ్తున్న ఓ గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్టేషన్ మేనేజర్ సాయి కిషోర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
