HomeTelanganaNizamabadరోటరీ క్లబ్ సేవ: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు!అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ..

రోటరీ క్లబ్ సేవ: దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు!అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ..

రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవ దివ్యాంగుల జీవితల్లో వెలుగులను తీసుకొని వస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ & రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో, నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ వారి సహకారంతో, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉచిత కృత్రిమ కాలు (జైపూర్ ఫుట్) పంపిణీ శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ , దివ్యాంగులకు కృత్రిమ కాలును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ ట్రస్ట్ వారు 2009 నుండి సేవ కార్యక్రమలు చేయడం అభినందనీయమన్నారు.

దివ్యాంగులకు కృత్రిమ కాలును అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న ఈ రోటరీ క్లబ్ ట్రస్ట్ వారి సేవ అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సహానుభూతితో అందరూ ముందుకొస్తే వారి జీవితాల్లో వెలుగు వస్తుంది అని తెలిపారు.

ఈ సందర్భంగా, నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్‌కు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే ట్రస్ట్ ద్వారా రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయల) ఆర్థిక సాయం అందిస్తానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ప్రకటించారు. అదేవిధంగా ఎటువంటి సహాయ సహకారాలైన అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో NRCT చైర్మన్ ఆకుల.అశోక్ ,రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ , కార్యదర్శి గోవింద్ జవహర్ , కోశాధికారి జుగల్ రాజు , బీజేపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments